
Kandahar Plane Hijacker: పాకిస్థాన్‌లోని కరాచీలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines Flight 814) విమానాన్ని హైజాక్ చేసి.. అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. ఈ హైజాక్‌కు పాల్పడిన జహూర్ మిస్త్రీ అనే ముష్కరుడు పాకిస్థాన్‌లోని కరాచీలో హత్యకు గురయ్యారు. 1999లో విమానం హైజాక్ ఘటనలో పాల్గొన్న ఐదుగురు నిందితుల్లో జహూర్ మిస్త్రీ ఒకడు. హైజాక్ ఘటన తర్వాత జహూర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అతన్ని ఏదో రహస్య ప్రదేశంలో దాచిపెట్టింది.
అనంతరం.. జహుర్ మిస్త్రీ .. జాహిద్ అఖుంద్ గా పేరు మార్చుకున్నాడు.గత కొంత కాలంగా అతడు కరాచీలోని అక్బర్ కాలనీలో జాహిద్ అఖుంద్ పేరుతో ఫర్నిచర్ వ్యాపారిగా చలామణి అవుతున్నాడు. ఈ నెల 1న అతణ్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన అంత్యక్రియల్లో జైష్-ఎ-మహమ్మద్(జేఈఎం) ఉగ్ర సంస్థకు చెందిన అగ్రనేతలు పాల్గొన్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఏ ఉద్దేశ్యంతో హత్య చేశారు? ఈ విషయాల గురించి సమాచారం ఇవ్వలేదు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా జియో టీవీ విడుదల చేసింది. దీంతో ఉగ్రవాది జహూర్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది.
హైజాక్ ఎలా జరిగింది?
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines Flight 814) విమానం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు ప్రయాణం ప్రారంభించింది. ఈ సమయంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం ఆ విమానం భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్ కాక్‌పిట్ వైపు వెళ్లాడు. విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించాడు. ఆ వెంటనే ముసుగులు ధరించిన మరో నలుగురు మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్నారు.
హత్య ఎలా జరిగింది
మార్చి 1న కరాచీ నగరంలో జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ హత్యకు గురయ్యాడని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జహూర్ మిస్త్రీ కొన్నేళ్లుగా కరాచీలో జాహిద్ అఖుంద్ అనే కొత్త గుర్తింపుతో నివసిస్తున్నట్లు తెలిపాయి. ఈ క్రమంలో జహూర్ మిస్త్రీ కరాచీలోని అక్తర్ కాలనీలో క్రెసెంట్ ఫర్నిచర్ పేరుతో షోరూమ్ నడుపుతున్నాడు. మార్చి 1 మిస్త్రీ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ లోని జియో టీవీ ప్రసారం చేసిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఈ హత్య పూర్తి ప్రణాళిక వేసినట్లు తేలింది. అక్తర్ కాలనీ వీధుల్లో ఇద్దరు సాయుధ వ్యక్తులు మోటార్‌సైకిళ్లపై తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. తర్వాత అవకాశం చూసి ఫర్నీచర్ షోరూంలోకి ప్రవేశించి జహూర్ మిస్త్రీని హత్య చేశాడు.