
న్యూఢిల్లీ: కరోనా కాలంలో భారత్ ఎదురొడ్డి నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ఈ విషయంలో ప్రపంచానికి మనమే స్పూర్తిగా నిలిచామని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాడు సాయంత్రం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు.సభలో అద్భుతంగా చర్చించిన మహిళా సభ్యులను అభినందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
మరో పాతికేళ్లలో దేశం అత్యున్నత స్థాయిలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు.బడ్జెట్ పై చర్చ బాగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రపంచ ఆశా కిరణంగా ఇండియా మారిందన్నారు. వైవిద్యంలోనూ మనం ఏకతాటిపై నడుస్తున్నామన్నారు.2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి కానుందన్నారు.