Miss World pageant: భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలుస్తోంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు.
Miss World pageant: భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. 71వ మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 18 నుంచి 'బ్యూటీ విత్ ఎ పర్పస్' ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సిని శెట్టి ఈ సారి భారత్ లో నిర్వహించబోతున్న మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించబోతోంది. ఈ ఈవెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా 120 పైగా దేశాలు పాల్గొనున్నాయి. ఈ పోటీ ఒక నెల పాటు కొనసాగే ఈ ఈవెంట్ గ్రాండ్ ఫినాలే మార్చి 9, 2024న ముంబైలో జరుగుతుంది.
ప్రతిష్టాత్మకమైన ఈ అందాల పోటీ 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో నిర్వహించబడుతుంది.ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సిని శెట్టి ఈ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ , CEO అయిన జూలియా ఎవెలిన్ మోర్లీ పోటీ గురించి మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందనీ, అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండని అన్నారు. చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి భారత్ ఆతిథ్యమివ్వడం గమనార్హం.
మిస్ వరల్డ్ ఫెస్టివల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
71వ మిస్ వరల్డ్ పోటీని 18 ఫిబ్రవరి మరియు 9 మార్చి 2024 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌తో సహా అనేక అద్భుతమైన వేదికలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుక ఇండియా వెల్‌కమ్ ద వరల్డ్‌తో ప్రారంభమవుతాయి. ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలే 9 మార్చి 2024న ముంబైలో నిర్వహించబడుతుంది.
హిస్టరీ..
1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ , 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’గా ఎంపికయ్యారు. 2022లో చివరిసారిగా నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించనున్నారు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాలు పోటీపడుతుండగా..మన దేశం తరుఫున ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన ‘‘సినీ షెట్టి’’ ప్రాతినిథ్యం వహించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా తన తోటి సోదరీమణులను భారత్ కు ఆహ్వనిస్తున్నానని, భారత అంటే ఏమిటో, భారత్ లో వైవిధ్యాన్ని చూపించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని సినీ షెట్టి అని పేర్కొన్నారు.