Ayodhya: ఆలయంపై అభ్యంతరం లేదు.. మసీదు కూల్చడంపైనే: ఉదయనిధి స్టాలిన్ సంచలనం

By Mahesh K  |  First Published Jan 19, 2024, 6:56 PM IST

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడంపై సమస్య లేదని, కానీ, అక్కడి మసీదును కూల్చి మందిరాన్ని కట్టడంపైనే తాము విభేదిస్తున్నామని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. డీఎంకే పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
 


Stalin: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అయోధ్యలోని రామ మందిరంపై గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చి మందిరాన్ని నిర్మించడంపైనే తమ పార్టీ ఏకీభావంతో లేదని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ ఏ మతానికి, విశ్వాసాలకు వ్యతిరేకంగా కాదనేది స్పష్టం అన్నారు. డీఎంకే ఏ మత విశ్వాసానికీ వ్యతిరేకం కాదని తన తాత ఎంకే కరుణానిధి చెప్పారని వివరించారు.

‘అయోధ్యలో రామ మందిరం నిర్మించడంపై అభ్యంతరమేమీ లేదు. కానీ, అక్కడ మసీదు కూల్చేసి ఆలయం కట్టడంపైనే ఏకీభావంతో లేం’ అని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి తెలిపారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అలాగే, రాజకీయాలను మతాలతో కలపరాదని అన్నారు. తమ ట్రెజరర్ టీఆర్ బాలు కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు.

Latest Videos

గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం ఒక రోగం వంటిదని, దాన్ని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యంగా బీజేపీ మండిపడింది. అనేక విధాల బెదిరింపులూ ఆయనకు వచ్చాయి. కానీ, ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

Also Read : Karnataka: సీఎం.. ఇలా జరుగుతుంటాయ్: సిద్ధరామయ్యతో ప్రధాని మోడీ.. వీడియో వైరల్

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్ష కూటమిలోని పార్టీ వ్యతిరేకించాయి. మందిర నిర్మాణం పూర్తి కానిదే ప్రాణ ప్రతిష్ట చేయడం ఏమిటంటూ మండిపడ్డాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ పని చేస్తున్నదని ఆగ్రహించాయి.

click me!