న్యూ ఇయర్ రోజున ఎంతమంది పుట్టారో తెలుసా?

Published : Jan 03, 2019, 03:12 PM IST
న్యూ ఇయర్ రోజున ఎంతమంది పుట్టారో తెలుసా?

సారాంశం

ఈ నూతన సంవత్సరంలో మన దేశంలో ఎంత మంది చిన్నారులు పుట్టారో తెలుసా..?


నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు.. అందరూ చాలా స్పెషల్ గా ఫీలౌతారు. అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామంటే ఏదో తెలియని ఉత్సాహం కూడా ఉంటుంది. ఆ స్పెషల్ రోజు పుట్టినరోజు అయితే.. ఇంకొంచెం స్పెషల్ గా ఉంటుంది కదా..

అలాంటి ప్రత్యేకమైన రోజున ఈ సారి మన దేశంలో 69,444మంది శిశువులు జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. మన తర్వాత చైనాలో ఈ ఏడాది జనవరి1వ తేదీన 44,940మంది శిశువులు జన్మించారు.ఆ తర్వాతి స్థానంలో నైజీరియా ఉంది. అక్కడ 25,685మంది జన్మించారు.

పాకిస్థాన్ లో 15,112 మంది, ఇండోనేషియాలో 13,256మంది, యూఎస్ లో1,086మంది శిశువులు జన్మించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3,95,072మంది ఆంగ్ల సంవత్సరాది రోజున పుట్టినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే