న్యూక్లియర్ సమర్థ అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం.. ‘కచ్చితత్వంతో లక్ష్య ఛేదన’

Published : Dec 18, 2021, 02:34 PM IST
న్యూక్లియర్ సమర్థ అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం.. ‘కచ్చితత్వంతో లక్ష్య ఛేదన’

సారాంశం

న్యూక్లియర్ సమర్థ అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత ప్రభుత్వం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్షను ప్రయోగిస్తే.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నట్టు అధికారులు వివరించారు.

న్యూఢిల్లీ: భారత్ మరో క్షిపణి(Missile)ని విజయవంతంగా పరీక్షించింది. Odisha తీరంలోని బాలాసోర్‌లో న్యూక్లియర్ క్యాపేబుల్ స్ట్రాటజిక్ అగ్ని ప్రైమ్ క్షిపణి(Agni Prime Missile)ని ప్రయోగించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వివరించారు. అగ్ని మిస్సైల్స్ కుటుంబానికి చెందినదే ఈ అగ్ని ప్రైమ్ క్షిపణి. అయితే, ఇది మరింత అడ్వాన్స్‌డ్ వేరియంట్. క్లాస్ అగ్ని క్షిపణి కంటే కూడా ఈ ప్రైమ్ క్షిపణిలో మరిన్ని ఫీచర్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.

ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి అగ్ని ప్రైమ్ మిస్సైల్ విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు. అగ్ని క్లాస్ మిస్సైల్ అధునాతన వేరియంటే అగ్ని ప్రైమ్ మిస్సైల్ అని వివరించారు. ఇది 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల సామర్థ్యం కలదని పేర్కొన్నారు. ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ 28వ చివరి సారి భారత ప్రభుత్వం క్షిపణి పరీక్ష చేసింది. ఈ క్షిపణిని పూర్తి  స్థాయిలో అభివృద్ధి చేస్తారని అధికారులు వివరించారు. భద్రతా బలగాల వ్యూహాత్మక లక్ష్యాల కోసం త్వరలోనే ఈ క్షిపణిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Also Read: అగ్ని ప్రైమ్ ప్రయోగం విజయవంతం

భారత ప్రభుత్వం సరికొత్త సాంకేతికత, సామర్థ్యాలను అందిపుచ్చుకునే ప్రక్రియలో భారత ప్రభుత్వం ఉన్నది. ఇటీవలే అగ్ని - 5 క్షిపణిని భారత ప్రభుత్వం ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. 

అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని జులైలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో  ఈ క్షిపణిని పరీక్షించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000-1500 కి.మీ. దూరంలో ఉన్న  లక్ష్యాలను సునాయాసంగా చేధించగలదు. వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్ధ్యం  ఈ క్షిపణికి ఉంది. రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని-1 కంటే తేలికగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.4 వేల కి.మీ. రేంజ్ కలిగిన అగ్ని4, 5 వేల కి.మీ. రేంజ్ గల అగ్ని 5 ఫీచర్లను సైతం అగ్ని ప్రైమ్ లో మిళితం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి డీఆర్‌డీఓ అధికారికంగా ప్రకటించింది. 

Also Read: ప్రతికూల పరిస్ధితుల్లోనూ గురి తప్పని వైనం.. నవతరం ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం

నవతరం ఆకాశ్ (ఆకాశ్-ఎన్‌జీ) క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో జులైలో ప్రకటించింది. ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. అత్యంత వేగంగా ప్రయాణించే మానవ రహిత గగనతల లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా నిరోధించినట్లు వివరించింది. ఈ పరీక్ష వల్ల స్వదేశంలో తయారైన ఆర్ఎఫ్ సీకర్, లాంచర్, మల్టీ ఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టమ్ పనితీరు సక్రమంగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. గాలి, వానలతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రయోగం జరిగిందని, దీంతో ఈ ఆయుధ వ్యవస్థ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్పష్టమవుతోందని డీఆర్‌డీవో తెలిపింది. ఈ ప్రయోగాన్ని భారత వాయు సేన అధికారుల బృందం వీక్షించినట్లు పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్