‘మా నాన్న మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు’.. తండ్రి మీద చిల్డ్రన్స్ కమిషన్ కు లేఖ రాసిన బాలుడు..

Published : Dec 18, 2021, 01:45 PM IST
‘మా నాన్న మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు’.. తండ్రి మీద చిల్డ్రన్స్ కమిషన్ కు లేఖ రాసిన బాలుడు..

సారాంశం

‘నన్ను, అమ్మను, చెల్లిని వదిలేసి మా నాన్న వేరే ఇంటికి వెళ్ళిపోయారు.  ఇకపై పీజు కట్టనని స్కూల్ యాజమాన్యానికి, ట్యూషన్ టీచర్ కు చెప్పారు. మా ఇంటికి కరెంట్ కనెక్షన్ కూడా తీయించేయమని ఎలక్ట్రిసిటీ బోర్డుకు లేఖ రాశారు. మా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. నేను ప్రస్తుతం చదువుకుంటున్నాను. ఇంటి భారం భరించలేను. నేను, మా చెల్లి ఆయనతో గొడవ పడలేదు, అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి మా నాన్న తో మాట్లాడండి’ అని బాలుడు లేఖలో పేర్కొన్నాడు.

మధప్రదేశ్ : ఆ భార్యాభర్తల మధ్య conflicts వచ్చాయి. భార్యను, పిల్లలను వదిలేసి అతను వేరే ఇంట్లోకి మారిపోయాడు. భార్యపై కోపాన్ని పిల్లలపై చూపించాడు. స్కూల్ ఫీజు కట్టేది లేదని చెప్పాడు. దీంతో ఆ పిల్లల చదువు ఆగిపోయింది. ఏం చేయాలో తోచక ఆ వ్యక్తి కొడుకు childrens commission కి లేఖ రాశాడు. తండ్రి తమను పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నాడు. స్పందించిన చిల్డ్రన్స్ కమిషన్ ఆ వ్యక్తిని పిలిచి 
Counseling ఇచ్చింది. Madhya Pradeshని భోపాల్లో ఈ ఘటన జరిగింది.

‘నన్ను, అమ్మను, చెల్లిని వదిలేసి మా నాన్న వేరే ఇంటికి వెళ్ళిపోయారు.  ఇకపై పీజు కట్టనని స్కూల్ యాజమాన్యానికి, ట్యూషన్ టీచర్ కు చెప్పారు. మా ఇంటికి కరెంట్ కనెక్షన్ కూడా తీయించేయమని ఎలక్ట్రిసిటీ బోర్డుకు లేఖ రాశారు. మా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. నేను ప్రస్తుతం చదువుకుంటున్నాను. ఇంటి భారం భరించలేను. నేను, మా చెల్లి ఆయనతో గొడవ పడలేదు, అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి మా నాన్న తో మాట్లాడండి’ అని బాలుడు లేఖలో పేర్కొన్నాడు.

ఆ లేఖపై చిల్డ్రన్స్ కమిషన్ మెంబర్ బ్రజేష్ చౌహన్ వెంటనే స్పందించారు.  ఆ బాలుడు తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు పెద్దగా అయ్యేవరకు వారి బాధ్యత తీసుకోవాలని సూచించారు. దాదాపు నాలుగు రోజుల కౌన్సిలింగ్ తర్వాత ఆ వ్యక్తి మనసు మార్చుకున్నాడు. తన పిల్లల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

ఆరునెలల చిన్నారి నరబలి.. మూఢనమ్మకంతో దారుణం.. !!

ఇదిలా ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త అకాల మరణం చెందడంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నవంబర్ లో జరిగింది. దీంతో వారి పిల్లలు అనాధలుగా మారారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకొంది. ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్న మహేశ్వరి, రమేష్ దంపతులకు  కొడుకు, కూతురున్నారు. 15 రోజుల క్రితం అనారోగ్యంతో రమేష్ మరణించాడు. దీంతో మహేశ్వరి మానసికంగా కుంగిపోయింది. 

భర్తను తలుచుకొంటూ తీవ్ర ఆవేదన చెందేది. శనివారం నాడు రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకొంది. ప్రతి రోజూ మాదిరిగానే పాల ప్యాకెట్ తీసుకెళ్లేందుకు తన స్కూటీ తీసుకొని వెళ్లింది. ఎంతసేపైనా ఆమె తిరిగి రాలేదు. దీంతో మహేశ్వరి తండ్రికి  అత్త విషయం చెప్పింది. అయితే  స్కూటీపై మహేశ్వరి చెరువు వైపునకు వెళ్లినట్టుగా గ్రామస్తులు చెప్పారు. కుటుంబసభ్యులు చెరువు వైపునకు వెళ్లేసరికి చెరువు కట్ట వద్ద మహేశ్వరి చెప్పులు, స్కూటీ కన్పించింది. 

భర్త మరణించిన విషయాన్ని తట్టుకోలేక మహేశ్వరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. రమేష్ చనిపోయిన నాటి నుండి కూడా మహేశ్వరి మానసికంగా కుంగిపోయిందని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు. తల్లీదండ్రులు ఇద్దరు మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. చిన్న పిల్లలను తాము ఏలా సాకాలని నానమ్మ, తాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu