5500 కి.మీ. రేంజ్ టార్గెట్:అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం సక్సెస్

Published : Dec 15, 2022, 07:30 PM ISTUpdated : Dec 15, 2022, 07:45 PM IST
5500 కి.మీ. రేంజ్ టార్గెట్:అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం  సక్సెస్

సారాంశం

అగ్ని-5 క్షిపణిని  రాత్రిపూట  భారత్  విజయవంతంగా  ప్రయోగించింది.  అబ్దుల్ కలాం  ఐలాండ్  నుండి  ఇవాళ  ప్రయోగించారు. 

న్యూఢిల్లీ: అగ్ని-5 బాలిస్టిక్  క్షిపణిని రాత్రిపూట  భారత్  గురువారం నాడు విజయవంతంగా ప్రయోగించింది.  డీఆర్‌డీఓ  అభివృద్ధి చేసిన  ఈ క్షిపణిని  ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం  నుండి పరీక్షించారు. గతంలో కంటే  అగ్ని-5 మిస్సైల్  తేలికగా ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.  అగ్ని-5 మిస్సైల్  సామర్ధ్యాన్ని  ఈ ట్రయల్  రుజువు చేసిందని  రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈ మిస్సైల్  ప్రయోగానికి  ముందు బంగాళాఖాతం  ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.

ఈ నెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్  సెక్టార్ లో  చైనా, ఇండియా ఆర్మీ మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది.ఈ  తరుణంలో  ఇండియా  అగ్ని-5 క్షిపణిని ప్రయోగించింది.  ఈ క్షిపణి  5500 కి.మీ. దూరంలోని  లక్ష్యాన్ని కచ్చితంగా  చేధించగలదు.  అగ్ని-5 క్షిపణికి చెందిన  అనేక రకాలు గతంలో విజయవంతంగా ప్రయోగించారు.

ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ఐసీబీఎం, అగ్ని5 ని  దేశీయంగా  డీఆర్‌డీఓ అభివృద్ది చేసింది.   భారతదేశం  అగ్ని-6 పై పని చేస్తుంది.  ఇది జలాంతర్గాముల నుండి  భూమి  నుండి ప్రయోగించగలదు. 8 వేల నుండి  10 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను  చేధించగలదు.గత రెండు దశాబ్దాలలో  భారతదేశం  అగ్ని-1, అగ్ని- 2, అగ్ని -3, అగ్ని -4, అగ్ని- 5 క్షిపణులను అభివృద్ది  చేసి విజయవంతంగా  ప్రయోగాలు చేసింది. డీఆర్‌డీఓ 2021లో కొత్త తరం అణు సామర్ధ్యం గల బాలిస్టిక్  క్షిపణి  అగ్ని పీ ని విజయవంతంగా పరీక్షించింది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎవ‌రీ సోన‌మ్ వాంగ్‌చుక్‌.? ఈయ‌న ల‌క్ష్యం ఏంటి.? | Who is Sonam Wangchuk? | Asianet News Telugu
White Animals: ఇండియాలో అరుదైన తెల్లటి అడవి జంతువులు కనిపించే 8 అద్భుతమైన ప్రదేశాలు ఇవే !