అయ్యప్ప భక్తులకు ట్రబుల్.. సురూలీ జలపాతంలో స్నానంపై అటవీ శాఖ నిషేధం.. తెనీ మీదుగా శబరిమల వెళ్లేవారిపై ప్రభావం

By Mahesh KFirst Published Dec 15, 2022, 6:22 PM IST
Highlights

శబరిమలకు తెనీ జిల్లా మీదుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు ఓ సమస్య వచ్చిపడింది. తెనీ జిల్లాలో ఫేమస్ అయిన సురులీ జలపాతం కింద స్నానం చేయడంపై అటవీ శాఖ అధికారులు నిషేధం విధించారు. వర్షాల కారణంగా సురులీ జలపాతం ఉధృతి పెరిగిందని, ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ స్నానంపై బ్యాన్ విధించినట్టు వివరించారు.
 

తిరువనంతపురం: శబరిమలకు తెనీ జిల్లా మీదుగా వెళ్లే అయ్యప్ప భక్తులు సురూలీ వెళ్లుతారు. అక్కడ ఆలయాలను దర్శించుకుని సురులీ జలపాతంలో స్నానం ఆచరించి శబరిమలకు వెళ్లుతారు. కానీ, ఈ సారి తెనీ మీదుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు ఓ కొత్త సమస్య వచ్చిపడింది. అక్కడ సురులీ జలపాతంలో స్నానం చేయడంపై అటవీ శాఖ నిషేధం విధించింది.

కుంబం సహా చుట్టుపక్క ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కొడుతున్నది. ఈ కారణంగా జలపాతానికి పెద్ద మొత్తంలో నీరు చేరుతున్నది. ఫలితంగా జలపాతం ఉధృతమైంది. దీంతో సేఫ్టీ చర్యల్లో భాగంగా అటవీ శాఖ ఈ తాత్కాలిక నిషేధం విధించింది. 

సురులీ వాటర్ ఫాల్స్ మంచి టూరిస్ట్ స్పాట్. తెనీ జిల్లా కంపం దగ్గర ఉన్న ఈ జలపాతానికి చాలా మంది పర్యాటకులు వస్తారు. ఇది ఒక గొప్ప స్పిరిచువల్ ప్లేస్ కూడా. దీనికితోడు శబరిమల సీజన్ కావడంతో సాధారణ పర్యాటకులతోపాటు అయ్యప్ప భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండనుంది. అందుకే ప్రజల ప్రాణ రక్షణ దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు.

Also Read: నేనేం పాపం చేశాను.. శబరిమలైలో వావర్ స్వామి గురించి తెలుసా : బీజేపీ నేతలకు అనిల్ యాదవ్ కౌంటర్

ఇటీవలి కాలంలో తెనీ సందర్శిస్తున్న అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా తెనీ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇట్టమాడు, తూవానమ్ డ్యామ్ ఏరియా సహా సురులీ జలపాత పరివాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సురులీ జలపాతానికి నీరు ఎక్కువగా వస్తున్నది.

అందుకే సురులీ జలపాతంలో నీటి ఉధృతి తగ్గే వరకు స్నానం చేయడానికి అవకాశం ఇవ్వబోమని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అఫీషియల్స్ వెల్లడించారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అంచనాలు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

click me!