కరోనా కేసుల్లో భారత్ మరో రికార్డు... బ్రెజిల్ ను వెనక్కినెట్టి రెండో స్ధానం

By Arun Kumar PFirst Published Sep 6, 2020, 10:08 AM IST
Highlights

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 41 లక్షలు చేరుకోగా 70వేల మంది చనిపోయారు. 

న్యూడిల్లీ: భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతుండటంతో భారత్ మరో రికార్డు సాధించింది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల్లో ఇంతవరకు మూడో స్థానంలో కొనసాగిన భారత్ తాజాగా రెండో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ ను వెనక్కినెట్టిన భారత్ అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింంది. 

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 41 లక్షలు చేరుకోగా 70వేల మంది చనిపోయారు. బ్రెజిల్ లో కరోనా కేసుల సంఖ్య 40 లక్షలుగా వున్నా మరణాలు మాత్రం బారీగా నమోదయ్యాయి. ఇక్కడ కరోనాతో ఇప్పటివరకు 1,25,500 మంది మృత్యువాతపడ్డారు. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశంగా అమెరికా మొదటిస్థానంంలో నిలిచింది. అక్కడ 62 లక్షల కేసులుండగా 1,88,000 మంది చనిపోయారు. 

read more  వచ్చే ఏడాదిలోనూ కరోనా ప్రభావం.. ఎయిమ్స్ వైద్యులు

శనివారం ఒక్కరోజే భారత్ లో 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,089 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 లక్షలకు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య కూడా 70వేలకు చేరుకుంది. ఇక కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 31,07,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,77,38,491 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. గత 24గంటల వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్రీయాశీలక కేసుల్లో 62శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లోనూ 70శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 

 

click me!