దారుణం: మాస్కుపై మత్తు చల్లి బాలికపై అత్యాచారం

Published : Sep 06, 2020, 07:07 AM IST
దారుణం: మాస్కుపై మత్తు చల్లి బాలికపై అత్యాచారం

సారాంశం

కరోనాను ఎదుర్కోవడానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి స్పృ కోల్పోగానే బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. పంజాబ్ లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

చండీగఢ్: పంజాబ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనాను అడ్డుకోవడానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాస్కుపై మత్తు చల్లడంతో స్పృహ తప్పిన బాలికపై అఘాయిత్యం చేశాడు. 

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. స్థానికంగా ఉండే లేబర్ కాంట్రాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ముఖానికి వేసుకుని మాస్కుపై మత్తు చల్లి దాన్ని బాలికకు ఇచ్చాడు.

ఆ విషయం తెలియని బాలిక మాస్కు ధరించింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో కాంట్రాక్టర్ ఆమెపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమెను బెదిరించాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 

ఆ విషయం చెప్పి బాధితురాలు బోరున విలపించింది. విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌