India Corona Cases : కొత్త కేసులకంటే పెరిగిన రికవరీలు.. 300లోపు మరణాలు...

By AN TeluguFirst Published Sep 20, 2021, 10:23 AM IST
Highlights

24 గంటల వ్యవధిలో 11,77,607 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందు రోజుకంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. 

ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 30వేల కేసులు, 300 లోపు మరణాలు సంభవించాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. కేరళలో 19 వేలు, మహారాష్ట్రలో 3 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. 

24 గంటల వ్యవధిలో 11,77,607 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందు రోజుకంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా.. 4.45 లక్షల మంది ప్రాణాలు విడిచారు.

విడాకుల కోసం వెడితే.. పెళ్లి చేసి పంపించారు...!

ఒక నిన్న ఒక్కరోజే 43,938 మంది కోలుకోగా... ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 3.27 కోట్లకు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య అదుపులో ఉంది. ప్రస్తుతం 3.18 లక్షల మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల రేటు ఒక శాతం దిగువకు చేరి.. 0.95 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.72 శాతానికి పెరిగింది. 

మరో పక్క నిన్న 37,78,296మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంక్య 80,85,68,144కి చేరింది. 

click me!