వివాహేతర సంబంధం : మహిళ గర్భం దాల్చడంతో.. నేనే తండ్రినంటూ ఇద్దరు యువకుల గొడవ.. ఒకరి మృతి.. !

Published : Sep 20, 2021, 09:28 AM IST
వివాహేతర సంబంధం : మహిళ గర్భం దాల్చడంతో.. నేనే తండ్రినంటూ ఇద్దరు యువకుల గొడవ.. ఒకరి మృతి.. !

సారాంశం

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఓ వివాహితతో ఇద్దరు యువకులు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి బెంబేలెత్తాల్సింది పోయి.. ఆ ఇద్దరు యువకులు పోటీ పడ్డారు. ఆ గర్భానికి తామేనంటూ గొడవకు దిగారు. పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానే అంటే.. తానే అంటూ ఘర్షణ పడ్డారు.

తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్రమసంతానానికి తండ్రినని ఒప్పుకోవడానికి ముందుకు రాని సంఘటనలు ఇప్పటివరకు మామూలే. అయితే అలాంటి సంతానానికి నేను తండ్రినంటే.. నేను తండ్రినంటూ ఇద్దరూ యువకులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. అంతేకాదు ఈ దాడిలో మరో వ్యక్తి మృతి చెందడంతో దారుణం జరిగిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. 

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఓ వివాహితతో ఇద్దరు యువకులు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి బెంబేలెత్తాల్సింది పోయి.. ఆ ఇద్దరు యువకులు పోటీ పడ్డారు. ఆ గర్భానికి తామేనంటూ గొడవకు దిగారు. పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానే అంటే.. తానే అంటూ ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా కత్తితో దాడి చేసుకున్నారు. దీంతో ఒకరు మృతి చెందారు. 

పంజాబ్: రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్‌జిత్ సింగ్

వివాహేతర సంబంధాలు ఇలాంటి విషాదాలకే దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా.. పదే పదే ఇలాంటివే జరుగుతుండడం దారుణం. అయోధ్య పట్టణం రామ్ నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి (23) అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్ (23), కృపై రాజ్ (23) తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహైతర సంబంధం పెట్టుకుంది. 

ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. శుక్రవారం ఈ విషయం ఇద్దరు ప్రియులకు తెలియడంతో గొడవపడ్డారు. కడుపులోని బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ.. వాదించుకున్నారు. ఆగ్రహించిన కలైఅరసన్ కత్తితో కృపైరాజ్ మీద దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్ లను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం