విడాకుల కోసం వెడితే.. పెళ్లి చేసి పంపించారు...!

Published : Sep 20, 2021, 10:01 AM IST
విడాకుల కోసం వెడితే.. పెళ్లి చేసి పంపించారు...!

సారాంశం

వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు కావాలని కోర్టుకు వెళ్లారు. వారికి అప్పటికే ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ఆదివారం ఆ విడాకుల కేసు విచారణకు వచ్చింది. 

ఒడిశా :  విడాకుల కోసం వచ్చిన దంపతులకు ఒడిశాలోని జయపురం కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో మళ్లీ పెళ్లి చేసిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెడితే.. బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హొతా కమతా పంచాయతీకి చెందిన అనితను 2016లో వివాహం చేసుకున్నాడు.

వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు కావాలని కోర్టుకు వెళ్లారు. వారికి అప్పటికే ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ఆదివారం ఆ విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు వాదించిన న్యాయవాది మున్నాసింగ్ వివాహబంధం గొప్పతనం వివరించి, వారిని ఒప్పించి మళ్లీ వివాహం జరిపించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ