భారత్ లో డేంజర్ బెల్స్.. ప్రమాదకరంగా కరోనా కేసులు

By telugu news teamFirst Published Apr 3, 2021, 12:55 PM IST
Highlights

ఇక కరోనా రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ఎగబాకింది. 

కరోనా మహమ్మారి భారత్ లో తీవ్ర రూపం దాలుస్తోంది. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ తిరగపెట్టింది. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా.. మరోవైపు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

ఇక కరోనా రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ఎగబాకింది. దేశంలో శుక్రవారం 89,129 కరోనా కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 69,986.. బ్రెజిల్‌లో 69,662 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 

కాగా గత సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,92,260 దాటింది. ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 1,64,1110 మంది మృత్యువాతపడగా.. ప్రస్తుతం 6,58,909 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.36%, మరణాల రేటు 1.32%గా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

click me!