రాసలీలల కేసు : సిట్ విచారణకు జార్కిహోళి గైర్హాజరు.. అనారోగ్యం కారణంగానే..

Published : Apr 03, 2021, 12:07 PM IST
రాసలీలల కేసు :  సిట్ విచారణకు జార్కిహోళి గైర్హాజరు..  అనారోగ్యం కారణంగానే..

సారాంశం

కర్ణాటకలో కలకలం సృష్టించిన రాసలీలల సీడీ కేసుకు సంబంధించి సిట్ చేపట్టిన విచారణకు కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. 

కర్ణాటకలో కలకలం సృష్టించిన రాసలీలల సీడీ కేసుకు సంబంధించి సిట్ చేపట్టిన విచారణకు కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. 

అయితే అనారోగ్యం కారణంగా రమేష్ జార్కిహోళి విచారణకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాది శ్యామ్ సుందర్ సిట్ అధికారులకు తెలిపారు. 

వచ్చే సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇలావుండగా, సిడి కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నసిట్ అధికారులపై ఎవరూ ఒత్తిడి చేయరాదని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్‌ స్పష్టం చేశారు. సిట్ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తారన్నారు. 

శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా పని చేయాలని ప్రభుత్వం వారిని నియమించిందన్నారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్