నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..!

Published : Mar 27, 2022, 10:35 AM IST
నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..!

సారాంశం

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మిమాన సర్వీసలు ప్రారంభం నేపథ్యంలో పలు దేశీయ సంస్థలతో పాటు, విదేశీ సంస్థలు అందుకు తగ్గట్లు భారత్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యాయి. 

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి అనేక రంగాలతో పాటు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కావడం ఈ రంగానికి పునరుద్దరణ అందిస్తుందనే ఆశాభావం వ్యక్తం అవుతుంది. మరో వారం రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణీకులు రద్దీ పెరుగుతుందని విమానయాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఏప్రిల్ మొదటి వారం నుంచి ఢిల్లోని Indira Gandhi International Airport నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు గణనీయంగా పెరుతాయని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇక, అంతర్జాతీయ మిమాన సర్వీసలు ప్రారంభం నేపథ్యంలో పలు దేశీయ సంస్థలతో పాటు, విదేశీ సంస్థలు అందుకుతగ్గట్లు భారత్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యాయి. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై నిషేధం విధించారు. ఆ తర్వాత జూలై నెలలో 37 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం కుదుర్చుకుని పరిమిత సంఖ్యలో సర్వీసులు కొనసాగిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించాలని విమానయాన మంత్రిత్వ శాఖ భావించినప్పటికీ.. కోవిడ్ థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరడంతో అది సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి (మార్చి 27) అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 

ఈ క్రమంలోనే కొన్ని కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. విమాన సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ప్రయాణికులు లేదా సిబ్బంది శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను ఎదుర్కొంటే సాయం అందిచేందుకు కొన్ని పీపీఈ కిట్లను ముందుజాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. 

కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. అంతర్జాతీయ విమానాలలో మూడు సీట్లను అత్యవసర వైద్య అవసరాలు, భద్రతా సిబ్బందికి ప్రత్యేకిస్తున్నారు. అయితే తాజాగా 3 సీట్లను ఖాళీగా ఉంచడంపై పరిమితిని ఎత్తివేశారు. గతంలో ప్రయాణికులును విమానాశ్రయంలో తనిఖీ చేసేవారు.. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో దానిని ఎత్తివేశారు.. ఇప్పుడు ఆ సోదాలను పునురుద్దరించనున్నారు. 

ఇక,  రాబోయే రెండు నెలల్లో విమానాల ట్రాఫిక్ కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. అదే సమయంలో, అంతర్జాతీయ విమానయాన సంస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి ఇందులో పాల్గొన్న అన్ని వాటాదారులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 2022-23లో ప్రయాణీకుల సంఖ్య 300 మిలియన్ల నుండి 2024-25 నాటికి భారతదేశంలో (దేశీయ మరియు అంతర్జాతీయ రెండింటికీ) ప్రయాణీకుల సంఖ్య 410 మిలియన్లకు చేరుకుంటుందని సింధియా చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్ | America Assembly | Asianet News Telugu
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?