Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం మొదలైంది. కోవిడ్-19 పంజాతో ఏడు నెలల రికార్డు సైతం బ్రేక్ అయింది. ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు లక్షన్నర మంది కరోనా బారినపడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం మొదలైంది. చాలా దేశాల్లో ఆందోళనకర స్థాయిలో Coronavirus కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పరిస్థితులు దిగజారాయి. ఇక భారత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం మొదలైంది. కోవిడ్-19 పంజాతో ఏడు నెలల రికార్డులు సైతం బ్రేక్ అయింది. ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు లక్షన్నర మంది కరోనా బారినపడ్డారు. Covid-19 మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ భయం ప్రజలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నతి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల గరిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19 మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మళ్లీ లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువైంది.
అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం గణనీయంగా పెరిగాయి. ఏకంగా నాలుగు లక్షలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి Covid-19 నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 3,44,12,740 కి చేరింది. కొత్తగా నమోదైన Coronavirus కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 40,925 కరోనా కేసులు అక్కడ నమోదయ్యాయి. అలాగే, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 68,34,222 కరోనా కేసులు, 1,41,614 మరణాలు నమోదయ్యాయి.
undefined
దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం భారత్ లో క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,868 యాక్టివ్ కేసులు ఉండగా, 1,203 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసులు అత్యధికం మహారాష్ట్రలో 876 నమోదయ్యాయి. ఆ తర్వతి స్థానంలో ఉన్న ఢిల్లీలో 513, కర్నాటకలో 333, రాజస్థాన్ లో 291, కేరళలో 284, గుజరాత్ లో 204, తెలంగాణలో 123, తమిళనాడు 121, హర్యానా 114, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్రలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని దాదాపు సగానికి సైగా రాష్ట్రాలకు Coronavirus ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం చర్యలను వేగవంతం చేశాయి. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు Covid-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 68,68,19,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 15,13,377 Coronavirus శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. ఇదిలావుండగా, ఇప్పటివరకు దేశంలో 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 85.8 కోట్లు మందికి మొదటి డోసు అందించారు. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 62.8 కోట్లకు చేరింది.