ఇండియాలో 3 కోట్లు దాటిన కోవిడ్ కేసులు: 2.9 కోట్ల మంది రికవరీ

By narsimha lodeFirst Published Jun 23, 2021, 9:59 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.  గత 24 గంటల్లో  దేశంలో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 రోజుల తర్వాత అతి తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో  1358 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.  గత 24 గంటల్లో  దేశంలో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 రోజుల తర్వాత అతి తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో  1358 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు  3,00,28, 709కి కరోనా కేసులు చేరాయి. దేశ వ్యాప్తంగా 6,43,194 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు  2.67 శాతానికి పడిపోయింది.  

నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మరణాల సంఖ్య కూడ నిన్నటితో పోలిస్తే పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల డేటా ప్రకారంగా తేలింది. అమెరికా తర్వాత ఇండియాలోనే మూడు కోట్ల కరోనా కేసులు దాటాయి. నిన్న ఒక్క రోజే కరోనా నుండి  68,817 మంది కోలుకొన్నారు. కరోనా నుండి ఇప్పటివరకు 2.9 కోట్ల మంది రికవరీ అయ్యారు. 

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాయి. దీంతో ఆయా రాష్ట్రాలు అన్‌లాక్ దిశగా ముందుకు వెళ్తున్నాయి.  అయితే ఈ సమయంలోనే కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని  కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.


 

click me!