ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: రికవరీ కంటే కొత్త కేసులే ఎక్కువ

By narsimha lodeFirst Published Sep 2, 2021, 9:51 AM IST
Highlights

 ఇండియాలో కరోనా కేసుల  వ్యాప్తి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 47,029 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు  3,28,57,937కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 509 మంది మరణించారు.


న్యూఢిల్లీ:  ఇండియాలో గత 244 గంటల్లో  47,029 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 509 మంది మరణించారు.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3.28,57,937 కి చేరుకొంది.  దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,39,529కి చేరింది.  ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 3,89, 583కి చేరింది.

గత 24 గంటల్లో కరోనా నుండి 35,181 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,20,28,825కి చేరుకొంది.  గత 24 గంటల్లో 81,09,244 మందికి వ్యాక్సినేషన్ అందించారు. దేశంలో ఇప్పటివరకు 66,30,37,334 మందికి వ్యాక్సినేషన్ అందించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 32,803 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదౌతున్న కరోనా కేసుల్లో  మెజారిటీ కేసుల్లో కేరళలోనే ఎక్కువ కేసులు నమోదౌతున్నాయి.

click me!