ఇండియాలో కరోనా తగ్గుముఖం: 4 లక్షలు దాటిన కోవిడ్ మృతులు

Published : Jul 02, 2021, 09:58 AM IST
ఇండియాలో కరోనా తగ్గుముఖం: 4 లక్షలు దాటిన కోవిడ్ మృతులు

సారాంశం

 ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు 46,617 నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 853 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు 46,617 నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 853 మంది మరణించారు.తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,04, 58, 251కి చేరుకొంది. గత 24 గంటల్లో కరోనా నుండి 59, 384 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య  2,95, 48, 302కి చేరింది. ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,09, 637కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,00,312 మంది మరణించారు..

మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనాతో  1.25 లక్షల మంది మరణించారు.  కర్ణాటకలో 35 వేలు, తమిళనాడులో 32 వేల మంది చనిపోయారు.కేరళ రాష్ట్రంలో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. జైడస్ క్యాడిల్లా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం డీసీజీఐ అనుమతి కోరుతూ ధరఖాస్తు చేసుకొంది. ఈ వ్యాక్సిన్ కు  అనుమతి లభిస్తే మరో వ్యాక్సిన్ కూడ ఇండియన్లకు అందుబాటులోకి రానుంది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌