తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

Published : Jul 02, 2021, 09:33 AM IST
తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ట్రస్టులో ఉంటున్న తన కొడుకును చూసేందుకు ఓ తల్లి ఇటీవలనే ఆశ్రమానికి వచ్చింది. అయితే  కరోనాతో ఆ బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులకు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.  అయితే వారం రోజుల క్రితమే ఆ పిల్లాడిని ట్రస్టు నిర్వాహకులు రూ. 5 లక్షలకు విక్రయించారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.ఈ విచారణలో ట్రస్టు నుండి పెద్ద ఎత్తున పిల్లలు మాయమయ్యారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 16కి పైగా  పిల్లలు అదృశ్యమయ్యారని గుర్తించారు. ఈ పిల్లల అదృశ్యానికి సంబంధించి సరైన సమాచారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఇవ్వలేదు.  ట్రస్టు నిర్వాహకులు రెండు మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆశ్రమం  నుండి పిల్లల అదృశ్యం వెనుక ఏదైనా ముఠా హఃస్తం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ, షా మాస్ట‌ర్ స్ట్రోక్‌.? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగినా బీజేపీకే లాభ‌మా.?
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu