24 గంటల్లో 44,230 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 3.15 కోట్లకు చేరిక

By narsimha lodeFirst Published Jul 30, 2021, 10:05 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కరోనా కేసులు 40 వేలకుపైగా నమోదయ్యాయి.  ఇండియాలో కరోనా కేసులు 3.15 కోట్లకు చేరుకొన్నాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 18 లక్షల మంది శాంపిల్స్ పరీక్షిస్తే  44,230 మందికి కరోనా సోకిందని తేలింది. దేశంలో కరోనా కేసులు 40 వేల మార్కును దాటుతున్నాయి. దేశంలో కరోనా కేసులు 3.15 కోట్లకు చేరుకొన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

గత 24 గంటల్లో 42,360 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.38 శాతంగా నమోదైంది.  దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3.07 కోట్ల మంది కోలుకొన్నారు.ఇక  కరోనా యాక్టివ్ కేసులు 4,05, 155కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో  555 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 4,23,217 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు  కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. నిన్న ఒక్క రోజే 51,83,180 మంది టీకాలు తీసుకొన్నారు. ఇప్పటివరకు దేశంలో 45,60,33,754 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

click me!