ఆయనను పార్టీలో తీసకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్ కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై.. అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇటీవల రాహుల్ గాంధీ సీనియర్ నాయకులైన కె.సి.వేణుగోపాల్, ఆనంద్ శర్మ, కమల్ నాథ్, మల్లికార్జున ఖర్గే, ఎ.కె. ఆంటోనీ, అజయ్ మాకెన్, అంబికా సోనీ, హరీష్ రావత్ లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిశోర్ పార్టీలోకి వస్తే.. కలిగే లాభ నష్టాల గురించి బేరీజు వేశారు. ప్రశాంత్ కిశోర్ కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పార్టీలో తీసకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్ కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.
undefined
బీజేపీని ఓడించాలంటే ప్రశాంత్ కిశోర్ చేసిన కొన్ని సూచనలపై సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. బీజేపీను ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని.. ఇతర పార్టీలతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
విపపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని.. అన్ని పార్టీలు ఏకం కావడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్ పవార్, లాలూ ప్రసాద్, సమాజ్ వాదీ నాయకుడు రాం గోపాల్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు.