కన్న కూతుళ్లపై పోలీసు లైంగిక దాడులు

Published : Jul 30, 2021, 09:16 AM IST
కన్న కూతుళ్లపై పోలీసు లైంగిక దాడులు

సారాంశం

ప్రతి నిమిషం అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో లైంగికంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. 

అతను ఉన్నత పదవిలో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నవారిని కాపాడాల్సింది పోయి.. కన్న కూతుళ్లనే కాటేయాలని చూశాడు. అతను చేస్తున్న అరచకాలను చూసి విసిగిపోయిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2006లో ఇలంగోవన్‌ అనే పోలీసు అధికారిని ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 13ఏళ్లు, 11ఏళ్ల వయసుగల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  కొంతకాలం వరకు బాగానే ఉన్న ఇలంగోవన్.. తర్వాత దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. 

ప్రతి నిమిషం అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో లైంగికంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో.. తట్టుకోలేక ఎదురుతిరిగితే.. భార్య, కూతుళ్లపై దాడి చేసేవాడు. దారుణంగా హింసించేవాడు.

రోజు రోజుకీ భర్త వేధింపులు ఎక్కువ అవడంతో.. భరించలేకపోయిన ఆమె.. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చసింది.అతను పోలీసు విభాగంలో పనిచేస్తూ.. ఇంత నీచమైన పనిచేయడం పట్ల స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం