ఇండియాలలో వరుసగా రెండో రోజూ 40 వేలకు పైగా కోవిడ్ కేసులు: రికవరీ కంటే కొత్త కేసులేక్కువ

By narsimha lodeFirst Published Jul 29, 2021, 10:24 AM IST
Highlights

 ఇండియాలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు 40 వేలకు పైగా నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో హెచ్చతగ్గుగలు కన్పిస్తున్నాయి. అయితే కరోనా రోగుల రికవరీ కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.


న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు 43,509గా నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 600 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా రోగుల రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే 17,28,795 మందికి పరీక్షలు నిర్వహిస్తే 43,509 మందికి కరోనా సోకింది.  దేశంలో ఇప్పటివరకు 46,26,29,773 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3,07,01, 612 మంది కోలుకొన్నారు. గత 24 గంటల్లో కరోనా నుండి 38,465 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 4,03,840 యాక్టివ్ కేసులున్నాయని  ఐసీఎంఆర్ ప్రకటించింది.దేశంలో వరుసగా రెండో రోజూ కూడ40 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. కరోనాతో దేశంలో మరణించిన రోగుల సంఖ్య 4.22 లక్షలకు చేరుకొంది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. 

click me!