విమానాల్లో వచ్చి మరీ చోరీలు..!

Published : Jul 29, 2021, 10:17 AM IST
విమానాల్లో వచ్చి మరీ చోరీలు..!

సారాంశం

ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్ లు జరగడంతో.. పోలీసులు నిఘా పెట్టారు.

విమానాల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడుతున్న  ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగలు యూపీకి చెందిన వారు కాగా.. కర్ణాటకలో పోలీసులకు చిక్కారు. నిందితులు యూపీ నుంచి విమానంలో వచ్చి.. చోరీలకు పాల్పడి.. ఆ తర్వాత రైలులో పరారయ్యేవారు.

నిందితులు అర్జున్ సింగ్(27), సోనుకుమార్(32) లుగా గుర్తించారు. వీరిద్దరూ బెంగళూరులోని గ్రామీణ జిల్లాలో 19 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు గుర్తించారు. ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్ లు జరగడంతో.. పోలీసులు నిఘా పెట్టారు.

ఈ క్రమంలో నిందితులు తన స్నేహితుడి గదిలో దాక్కున్నట్లు తెలిసి.. అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. నిందితులను సర్జాపురలోని తన గదిలో ఉంచుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తిరిగి చివరకు యూపీలో నిందితులను అరెస్టు చేసారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport