నెల కింద ప్రేమపెళ్లి.. మహిళ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య...!

Published : Jul 29, 2021, 10:04 AM IST
నెల కింద ప్రేమపెళ్లి.. మహిళ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య...!

సారాంశం

కొత్తగా పెళ్లైన మహిళా కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలకా చిక్క గొల్లరహట్టిలో జరిగింది. మృతురాలు నేత్రా (27). ఈమె కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది. 

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. ఓ లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. నెలకిందటే వివాహం చేసుకున్న ఆమె ఈ దారుణానికి ఒడికట్టడంతో విషాదం నిండింది. భార్యభర్తల మధ్య చిన్న గొడవే దీనికి కారణంగా తెలుస్తోంది. 

కొత్తగా పెళ్లైన మహిళా కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలకా చిక్క గొల్లరహట్టిలో జరిగింది. మృతురాలు నేత్రా (27). ఈమె కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది. 

పీణ్యాలో కానిస్టేబుల్ అయిన మంజునాథ్ ఆమెను నెలరోజుల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిదీ తుమకూరు జిల్లా స్వస్థలం. కాగా, భార్యభర్తల మధ్య వంట చేసే విషయమై ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాదనాయనహళ్లి పోలీసులు ఆమె మరణాన్ని అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం