మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు: రికవరీ కంటే కొత్త కేసులే అధికం

By narsimha lodeFirst Published Aug 5, 2021, 11:05 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే 42,982 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 533 మంది కరోనాతో మరణించారు. దేశంలో 3.18 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి.


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టకపోతే థర్డ్ వేవ్  ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గత 24 గంటల్లో 42,982 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్క రోజే 533 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడ పెరిగింది.తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసులు 3.18 కోట్లకు చేరుకొన్నాయి.కరోనాతో ఇప్పటివరకు 4,26,290 మంది మరణించారు. 

ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 4,11,076లుగా నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే 41,726 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3.09 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల రేటు 1.29 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 97.37 శాతానికి చేరుకొంది.దేశంలో నిన్నటివరకు 48.93 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.


 

click me!