చత్తీ‌స్‌ఘడ్‌లో దారుణం: ఐఈడీని పేల్చిన మావోలు, 12 మంది పౌరులకు గాయాలు

By narsimha lodeFirst Published Aug 5, 2021, 10:23 AM IST
Highlights

ఛత్తీ‌స్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం నాడు మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం నాడు దారుణం చోటు చేసుకొంది. మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. ఈ పేలుడుతో  12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.రాష్ట్రంలోని గోతియా అటవీప్రాంతంలో ఐఈడీ పేల్చారు. ఈ ఘటన తర్వాత పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మలెవాహి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.

 

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం నాడు దారుణం చోటు చేసుకొంది. మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. ఈ పేలుడుతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. pic.twitter.com/CwEsb3mcEa

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

ఇవాళ ఉదయం దంతేవాడ జిల్లాలోని గోత్రియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు.నారాయణపూర్ జిల్లా నుండి దంతేవాడకు బొలెరో వాహనంలో 12 మంది ప్రయాణిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ వాహనంలో ప్రయాణీస్తున్న 12 మంది గాయపడ్డారు. గాయపడిన 12 మందిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించినట్టుగా జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు.సంఘటన స్థలానికి ఎస్పీ కూడ చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించడంలో సహాయం అందించారు.  దంతేవాడ, నారాయణపూర్ దక్షిణ ఛత్తీస్‌ఘడ్ , బస్తర్  ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుంది.

click me!