కాంస్యం గెలిచిన హాకీ టీమ్.. మోదీ స్పందన ఇదే..!

Published : Aug 05, 2021, 10:27 AM ISTUpdated : Aug 05, 2021, 10:51 AM IST
కాంస్యం గెలిచిన హాకీ టీమ్.. మోదీ స్పందన ఇదే..!

సారాంశం

ఈ విజయంపై తాజాగా.. ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.

41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ... భారత హాకీ జట్టు టోక్యో  ఒలంపిక్స్ లో 5-4 తో జర్మనీని ఓడించి.. కాంస్య పతకం సాధించింది. 1980 తర్వాత భారత హాకీ జట్టు జర్మనీ పై అద్భుతమైన విజయం సాధించి.. భారత్ కు కాంస్యాన్ని అందించింది.

ఈ విజయం అందరికీ మాంచి కిక్ ఇచ్చింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా... ఈ విజయంపై తాజాగా.. ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.

‘ చరిత్రలో నిలిచిపోయేరోజు. ఈ రోజుని ప్రతి భారతీయుడు గుర్తించుకునే రోజు ఇది. కాంస్యం గెలిచిన భారత పురుషుల జట్టుకి అభినందనలు. ఈ ఘనతతో మన దేశ ఖ్యాతిని పెంచారు. హాకీ జట్టుని చూసి.. యావత్ భారత దేశం గర్వపడుతుతోంది.’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

 

మోదీ మాత్రమే కాదు.. చాలా మంది సెలబ్రెటీలు ఈ విజయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?