ఇండియాలో గత 24 గంటల్లో 42,766 కొత్త కరోనా కేసులు: కేరళలోనే 29,682 కేసులు

Published : Sep 05, 2021, 10:33 AM IST
ఇండియాలో గత 24 గంటల్లో 42,766 కొత్త కరోనా కేసులు: కేరళలోనే 29,682 కేసులు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలోనే కరోనా కేసుల వ్యాప్తి తగ్గడం లేదు. దేశంలో నమోదౌతున్న కేసుల్లో కేరళ రాష్ట్రానికి చెందినవే మెజారిటీ కేసులు.  గత 24 గంటల్లో  42,766 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా 40 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన చెందుతున్నారు.గత 24 గంటల్లో 42,766 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  అంతేకాదు నిన్న ఒక్క రోజే 308 మంది మరణించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు రికార్డయ్యాయి. నిన్న ఒక్క రోజే 29,682 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనాతో గత 24 గంటల్లో  142 మంది మరణించారు.

గత 24 గంటల్లో దేశంలో 17,47,476 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు కరోనాతో ఇండియాలో 4,40,533కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి  38,091 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 3,21,38,092 మంది చేరుకొన్నారు.

కరోనా రోగుల రికవరీ రేట  97.42 శాతంగా ఉందని ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,10, 048కి చేరుకొంది. కరోనా యాక్టివ్ కేసులు 1.24 శాతంగా నమోదైందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.ఇండియాలో ఇప్పటివరకు 68,46,69,521 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. నిన్న ఒక్కరోజే 71,61,760 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారని వైద్య శాఖ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్