ఇండియాలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు: రికవరీ కంటే కొత్త కేసులే అధికం

By narsimha lodeFirst Published Aug 4, 2021, 10:18 AM IST
Highlights


  ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కల్గిస్తోంది. కేసులను అదుపు చేయకపోతే థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిన్న ఒక్క రోజే 42, 625 కరోనా కేసులు నమోదయ్యాయి.


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు 40 వేలకు దిగువన నమోదైన కేసులు నిన్న  ఒక్క రోజులోనే  42 వేలకుపైగా నమోదయ్యాయి. కరోనా కేసులను అదుపు చేయకపోతే థర్డ్ వేవ్ ‌తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెండు రోజుల క్రితం ఇండియాలో  30,549 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 42,625 కేసులు రికార్డయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనాతో 562 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,25,757కి చేరుకొంది.


నిన్న ఒక్క రోజే 18,47,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 47 కోట్ల మందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.కరోనా యాక్టివ్ కేసులు 4,10,356కి చేరుకొంది. యాక్టివ్  కేసులు 1.29 శాతానికి చేరుకొన్నాయని ఐసీఎంఆర్ నివేదిక వెల్లడిస్తోంది. నిన్న ఒక్క రోజు  కరోనా నుండి 36,668 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 3.09 మంది కోలుకొన్నారు. కరోనా రికవరీ రేటు 97.37 శాతంగా నమోదైంది.నిన్న  62.56 లక్షల మంది టీకాలు వేయించుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 48 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.
 

click me!