భార్యతో గొడవ.. ఎనిమిది నెలల కూతుర్ని నేలకేసి కొట్టి తండ్రి ఘాతుకం...

Published : Aug 03, 2021, 05:00 PM IST
భార్యతో గొడవ.. ఎనిమిది నెలల కూతుర్ని నేలకేసి కొట్టి తండ్రి ఘాతుకం...

సారాంశం

మహ్మద్ నజీమ్ ఖుర్డ్ గ్రామానికి చెందిన మహతాబ్ జహాన్ ను 18 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది నెలల కూతురు ఉంది. అయితే మద్యానికి బానిసైన నిందితుడు నజీమ్ తరచూ భార్యతో గొడవ పడేవాడు .దీంతో కొన్ని రోజుల క్రితం అతడి నుంచి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బిజ్నోర్ జిల్లా మండవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహత్ పూర్ ఖుర్ద్ గ్రామంలో మహ్మద్ నజీమ్ అనే వ్యక్తి తన కూతురుని నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 

పోలీసులు వివరాల ప్రకారం... మహ్మద్ నజీమ్ ఖుర్డ్ గ్రామానికి చెందిన మహతాబ్ జహాన్ ను 18 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది నెలల కూతురు ఉంది. అయితే మద్యానికి బానిసైన నిందితుడు నజీమ్ తరచూ భార్యతో గొడవ పడేవాడు .దీంతో కొన్ని రోజుల క్రితం అతడి నుంచి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. 

ఈ క్రమంలో జులై 31 రాత్రి మద్యం తాగి మహతాబ్ ఉండే నివాసానికి వచ్చిన నజీమ్ తన కుమార్తెను తనతో తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. మహతాబ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నజీమ్ తన కుమార్తెను నేలకేసి చనిపోయే దాకా కొట్టాడు.

కాగా మహతాబ్ ఆ చిన్నారిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఒక భార్య మహతాబ్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 1న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ధరమ్ వీర్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌