దేశంలో 24 నకిలీ యూనివర్శిటీలు: జాబితా ఇదీ..

By narsimha lodeFirst Published Aug 3, 2021, 4:18 PM IST
Highlights

దేశంలోని 24 నకిలీ యూనివర్శిటీలున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. లోక్‌సభకు మంత్రి లిఖితపూర్వకంగా ఈ సమాధానమిచ్చారు.  
 


న్యూఢిల్లీ: యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్   (యూజీసీ ) 24 యూనివర్శిటీలను నకిలీ యూనివర్శిటీలుగా గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ప్రకటించారు.లోక్‌సభలో ఈ విషయమై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.ఈ  నకిలీ యూనివర్శిటీలపై అందిన పలు ఫిర్యాదులు అందాయని మంత్రి చెప్పారు. యూపీకి చెందిన మరో రెండు యూనివర్శిటీలు కూడ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు.నకిలీ యూనివర్శిటీలు ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని ఆయన చెప్పారు. 

 వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ,  మహిళా గ్రామ్‌ విద్యాపీఠ్,  గాంధీ హింది విద్యాపీఠ్, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి,  నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌ విశ్వవిద్యాలయ, మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్‌ విశ్వవిద్యాలయ,  ఇంద్రప్రస్త శిక్షా పరిషత్,కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వకేషనల్‌ యూనివర్సిటీ, ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యురిడిసియల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ)లు నకలీవని మంత్రి వివరించారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్, నవభారత్‌ శిక్షా పరిషద్,  నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని  రాజా అరబిక్‌ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీలు కూడా ఫేక్‌ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది. 

click me!