ఇండియాలో కోవిడ్: కొత్త కేసులు, రికవరీ సమానం

Published : Jul 25, 2021, 10:41 AM ISTUpdated : Jul 25, 2021, 10:43 AM IST
ఇండియాలో కోవిడ్: కొత్త కేసులు, రికవరీ సమానం

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. 50 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదౌతున్నాయి.  గత 24 గంటల్లో 39,742 కేసులు రికార్డయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.  

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల వ్యవధిలో 39,742 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే  535 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో  17,18,756 మందికి పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటివరకు కరోనాతో 4,20, 551 మంది మరణించారు. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 39,972 మంది కోలుకొన్నారు.దేశంలో కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 3,05, 43,138కి చేరుకొంది. 

దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,08,212కి చేరుకొంది.  కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.30 శాతానికి తగ్గింది.దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.  ఇప్పటి వరకు 43,31,50,864 మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు. నిన్న ఒక్క రోజే  51,18,210 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు.కరోనా యాక్టివ్ కేసులు 1.30 శాతానికి తగ్గిపోయాయి.రోజువారీ కరోనా యాక్టివ్ కేసులు 2.31 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 


 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు