ఇండియాలో కరోనా కలకలం: 24 గంటల్లో 40వేల కేసులు నమోదు, మూడు నెలల్లో ఇదే అత్యధికం

By narsimha lodeFirst Published Mar 19, 2021, 1:22 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 40 వేల కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ 29వ తేదీ తర్వాతింత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 40 వేల కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ 29వ తేదీ తర్వాతింత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.దేశంలో కరోనా కేసులు 1,15,14,331 నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 154 మంది మరణించారు. కరోనాతో మరణించినవారి సంఖ్య దేశంలో 1,59,370కి చేరుకొంది.

దేశంలోని మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 25,833 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్,రాత్రి పూట కర్ఫ్యూను ఆ రాష్ట్రం అమలు చేస్తోంది.రెస్టారెంట్స్, హోటళ్ల నిర్వహణ విషయంలో ఆంక్షలను విధించింది. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలను  ప్రభుత్వం మూసివేసింది.ప్రతి రోజూ కొత్త కరోనా కేసుల్లో మహారాష్ట్రలో 63.21 నమోదౌతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, పంజాబ్ రాష్ట్రాలున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పూట కర్ప్యూను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మరో 9 జిల్లాల్లో కూడ రాత్రి పూట కర్ఫ్యూను విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు.

లూథియానా, జలంధర్, పాటియాల, మొహాలీ, అమృత్ సర్, గురుదాస్‌పూర్, హోసియార్‌పూర్, కపుర్తాలా, రోపర్ జిల్లాల్లో ప్రతి రోజూ 100కి పైగా కేసులు నమోదౌతున్నాయి.కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని పెంచారు.


 

click me!