ఆడపిల్ల పుట్టకూడదని.. ఎనిమిదిసార్లు అబార్షన్.. చివరకు..!

Published : Aug 18, 2021, 07:41 AM IST
ఆడపిల్ల పుట్టకూడదని.. ఎనిమిదిసార్లు అబార్షన్.. చివరకు..!

సారాంశం

2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.


ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నారు. తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇలాంటి రోజుల్లోనూ ఇంకా చాలా మంది ఆడపిల్ల పుట్టకూడదని కోరుకుంటుండటం గమనార్హం. తాజాగా ఓ వ్యక్తి.. ఆడపిల్ల పుట్టకూడదని.. మగ పిల్లాడి కోసం దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆమెకు వందల సంఖ్యలో హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేయించాడు. ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయికి చెందిన ఓ యువతికి 2007లో వివాహమైంది.  ఆమెను బాగా సంపన్న కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన కొంతకాలానికే ఆమెకు వేధింపులు మొదలుకావడం గమనార్హం. 2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.

మరోవైపు తానూ చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్థారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్ష సమయంలో ఆమెకు 1500 పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు.

మరోవైపు వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేక విసిగివేసారిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Saving Schemes : మీ డబ్బుకు 100% సేఫ్టీ, అదిరిపోయే వడ్డీ.. ఈ ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్ లో చేరితే భవిష్యత్ బంగారమే..!
Most Abusive States : తిట్ల పురాణంలో ఢిల్లీకి గోల్డ్ మెడల్.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటి?