jammu kashmir : కాశ్మీర్‌ అవంతిపొరాలో జైషే మహ్మద్ ఉగ్రవాది స‌హ‌చ‌రుడి అరెస్ట్

By team teluguFirst Published Jan 23, 2022, 8:42 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరాలో జైషే మహ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాది స‌హ‌చ‌రుడిని భద్రతా బలగాలు శనివారం అరెస్టు చేశాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు వివరాలు వెల్లడించారు. అతడి రహస్య స్థావరం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరాలో జైషే మహ్మద్ (JeM) తో సంబంధం ఉన్న ఉగ్రవాది స‌హ‌చ‌రుడిని భద్రతా బలగాలు శనివారం అరెస్టు చేశాయి. అతడి రహస్య స్థావరం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇండియ‌న్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సహచరుడిని ప‌ట్టుకొని అరెస్టు చేశారు. జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిర్దిష్ట స‌మాచారం ఆధారంగా అవంతిపొర పోలీసులు, ఆర్మీ 55 RR, CRPF 185 బెటాలియన్ క‌లిసి తీవ్ర‌వాది స‌హ‌చ‌రుడిని ప‌ట్టుకున్నాయి. అరెస్టయిన ఉగ్రవాద సహచరుడిని అవంతిపోరాలోని రెంజిపోరా నివాసి ఉమర్ ఫరూఖ్ భట్‌గా గుర్తించారు. అతని నుంచి హ్యాండ్ గ్రెనేడ్‌తో సహా నేరారోపణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అత‌డు ఫెర్రీలో ఉగ్రవాదులకు ఆశ్రయం క‌ల్పించ‌డం, లాజిస్టిక్స్ స‌హాయం అందించ‌డం, పోలీసుల‌ కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని జేఈఎంకు పంపించ‌డం వంటివి చేస్తాడ‌ని గుర్తించారు. ఉగ్ర‌వాది స‌హ‌చ‌రుడిపై  సంబంధిత సెక్షన్ల కింద అవంతిపొర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ జరుగుతోంది.

శ‌నివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని కిల్బాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అన్ని పదార్థాలను తదుపరి విచారణ కోసం కేసు రికార్డుల్లోకి తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
 

click me!