కోవిడ్ 19 : దేశంలో మరోసారి భారీగా మరణాలు.. 31వేలకు దిగువకు కేసులు..

Published : Jul 13, 2021, 11:27 AM IST
కోవిడ్ 19 : దేశంలో మరోసారి భారీగా మరణాలు.. 31వేలకు దిగువకు కేసులు..

సారాంశం

గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1000 లోపు నమోదవుతున్న మరణాల సంఖ్యలో... భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా వ్యాప్లి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ... మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 31,443 మందికి పాజిటివ్ గా తేలింది.  

118 రోజుల కనిష్టానికి కొత్త కేసులు క్షీణించాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1000 లోపు నమోదవుతున్న మరణాల సంఖ్యలో... భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక దేశంలో మొత్తం కేసుల 3.09 కోట్లకు చేరగా.. 4,10,784 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్కరోజే 49,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీలు మూడు కోట్ల మార్కును దాటాయి. రికవరీ రేటు 97.28 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 4,32,778 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు.

జనవరి 16న కేంద్రం కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 38 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది.  నిన్న 40,68, 862 మంది టీకా వేయించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu