కాపురంలో జ్యోతిష్యం చిచ్చు : భార్య ఉండగా ఎప్పటికీ ఎమ్మెల్యే కావన్నందుకు.. ఆ ప్రబుద్ధుడు చేసిన పని... !!

Published : Jul 13, 2021, 10:49 AM ISTUpdated : Jul 13, 2021, 04:00 PM IST
కాపురంలో జ్యోతిష్యం చిచ్చు : భార్య ఉండగా ఎప్పటికీ ఎమ్మెల్యే కావన్నందుకు.. ఆ ప్రబుద్ధుడు చేసిన పని... !!

సారాంశం

తాజాగా జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి సొంత భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగుచూసింది.

జ్యోతిష్యం ఓ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది.  భార్యభర్తల మధ్య కలహాలకు దారి తీసి.. చివరికి వరకట్న వేధింపులకు విడాకులకేసుల దాకా తీసుకుపోయింది. ఇంతకీ ఇందులో తప్పెవరికి.. భవిష్యత్ గురించి తెలసుకోవాలనుకుని జ్యోతిష్యం చెప్పించుకున్న వ్యక్తిదా? అదే అదనుగా తప్పుదారి పట్టించిన జ్యోతిష్కుడిదా? ఇద్దరి మధ్యలో ఏ తప్పూ చేయకుండానే నలిగిపోయిన భార్యదా?

జాతకాలు, జ్యోతిష్యం వంటివాటిని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారు. రాశిఫలాలు, గ్రహాలు అంటూ .. మంచిదని చెబితే పాటించడానికి వెనకాడరు. దీంతో జీవితంలో తాము అనుకున్నది సాధిస్తామని నమ్ముతారు. అయితే ఇది కొన్నిసార్లు మంచి జరిగినా.. చాలాసార్లు దుష్ప్రభావాలు ఉంటాయి. 

తాజాగా జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి సొంత భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగుచూసింది.

తమిళనాడులో దారుణం: భర్తను కొట్టి వివాహితపై గ్యాంగ్‌రేప్, చిత్రహింసలు

తను ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలని రఘునాథ్ అనే వ్యక్తి జ్యోతిష్కుని అడిగాడు. దీనికి అతను... ఇంట్లో నీ భార్య ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలలను సాధించలేవని.. ఆమె మంచిది కాదని నిందలు వేసాడు. తనకు విడాకులు ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని సలహా కూడా ఇచ్చాడు.

ఇది బాగా నమ్మిన రఘునాథ్ అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన భార్య, తనను వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని భర్త , అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu