స్పుత్నిక్-వి : త్వరలో కమర్షియల్ లాంచ్.. గుడ్ న్యూస్ చెప్పిన డా. రెడ్డీస్...

By AN TeluguFirst Published Jul 13, 2021, 11:10 AM IST
Highlights

డాక్టర్ రెడ్డీస్ ఓ కీలక ప్రకటన చేసింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. 

న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్లు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత అనేక విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ లతో పాటు.. స్పుత్నిక్ - వి కి అనుమతి లభించింది.

అయితే ఇది చాలా రోజులవుతున్నా స్పుత్నిక్ - వి ఇంకా అందుబాటులోకి రాకపోవడంమీద తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ఓ కీలక ప్రకటన చేసింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. 

రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. 

కాగా 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్న స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ ను మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ భారత్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన దిగుమతి చేసుకున్న 100 మిలియన్ల స్పుత్నిక్ వి డోసులను అందించాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. 

దేశవ్యాప్తంగా స్పుత్నిక్ - వి సాఫ్ట్ లాంచ్ దేశంలోని 50 కి పైగా నగరాలు,  పట్టణాలకు చేరుకుందని, రాబోయే వారాల్లో ఇది రష్యన్ వ్యాక్సిన్ వాణిజ్య రోల్-అవుట్ ను బలోపేతం చేస్తుందని తెలిపింది.

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మొదట్లో హైదరాబాద్‌లో ప్రారంభించిన స్పుత్నిక్ - వి సాఫ్ట్ లాంచ్ రోల్-అవుట్ ఇప్పుడు వేగంగా పెరిగి అనేక భారతీయ నగరాలకు చేరుకుంది.

సెప్టెంబర్ 12న నీట్ 2021 పరీక్షలు... కేంద్రం ప్రకటన

"డాక్టర్ రెడ్డీస్ ఈ ప్రయోజనం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రులతో టై అప్ అయి ఉన్నారు. వీరంతా స్పుత్నిక్ - వి కమర్షియల్ లాంచ్ ను విజయవంతంగా చేస్తారు" అని ఒక ప్రకటనలో తెలిపింది.

స్పుత్నిక్ వి సెకండ్ డోస్ కొరత, కమర్షియల్ రోల్-అవుట్ ఆలస్యం అవుతుందనే నివేదికల మధ్య డాక్టర్ రెడ్డిస్ ఈ స్పష్టతనిచ్చింది. ఈ సాఫ్ట్ లాంచ్ కింద కంపెనీ దేశంలోని ఆసుపత్రులకు 1.95 లక్షలకు పైగా మోతాదులను అందించినట్లు గమనించాలి. 

వాస్తవానికి జూన్ మధ్యకాలానికే  పూర్తిస్థాయిలో రోల్-అవుట్ ప్లాన్ చేసింది. అయితే ఈ సంస్థకు ఇప్పటివరకు సుమారు 30 లక్షల మొదటి డోస్ లను, 3.60 లక్షల రెండవ డోస్ లను అందుకున్నట్లు సమాచారం.

click me!