india corona cases: 31,382 కొత్త కరోనా కేసులు, కేరళలోనే అత్యధిక కేసుల నమోదు

Published : Sep 24, 2021, 09:56 AM IST
india corona cases:  31,382 కొత్త కరోనా కేసులు, కేరళలోనే  అత్యధిక కేసుల నమోదు

సారాంశం

ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. అయితే ఇండియాలో నమోదౌతున్న కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదౌతున్న కేసులే అధికంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఇండియాలో  31,382 కొత్త కరోనా కేసులు  నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో 19,682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.


న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో  31,382 కొత్త కరోనా కేసులు (covid -19 cases) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 318 మంది కరోనాతో మరణించారు.ఇండియాలో నమోదౌతున్న కేసుల్లో అత్యధికంగా కేరళ  (kerala )రాష్ట్రం నుండే నమోదౌతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో గ  24 గంటల్లో19,682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో కేరళలో 152 మంది మృతి చెందారు.

ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,00, 162కి చేరుకొన్నాయి. 188 రోజుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 97.78 శాతంగా ,నమోదైంది. ఇండియాలో ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా రోగుల రికవరీ రేటు అత్యధికంగా  నమోదైందని ఐసీఎంఆర్ తెలిపింది.ఇండియాలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 4,46,368కి చేరుకొంది. మరో వైపు కరోనా నుండి గత 24 గంటల్లో ఇండియాలో 32,542 మంది కోలుకొన్నారు.  దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుండి 3,28,48,273 మంది కోలుకొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం