ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాలి.. ప్రధాని మోదీతో కమలా హ్యారిస్..!

Published : Sep 24, 2021, 08:56 AM IST
ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాలి.. ప్రధాని మోదీతో కమలా హ్యారిస్..!

సారాంశం

అమెరికా, భారత దేశ భద్రతపై వైట్ హౌస్ లో గురువారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

ప్రధాని నరేంద్రమోదీ.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ పర్యటనలో భాగంగా ఆయన  అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో.. వీరు ఉగ్రవాదం, దానిలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించడం గమనార్హం. దేశంలో ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయని.. ఇస్లామాబాద్ ప్రభావం పడకుండా చుర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మోదీని కోరారు.

అమెరికా, భారత దేశ భద్రతపై వైట్ హౌస్ లో గురువారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమయంలో వారు ఇండో-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రజా స్వామ్యం, ఆప్ఘనిస్తాన్ , ఇండో-పసిఫిక్ కు ఉన్న ముప్పులతో సహా అన్ని ప్రపంచ సమస్యలపై వీరు చర్చ జరపడం గమనార్హం.

తీవ్రవాదం సమస్య వచ్చినప్పుడు.. ఈ విషయంలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా తెలిపారు. ఉగ్రవాదం లో పాకిస్తాన్ పాత్ర ఎంత వరకు ఉండవచ్చని కమలాహ్యారిస్ మోదీని ప్రశ్నించడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  అమెరికా భద్రత, భారతదేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని  ఆమె ఈ సందర్భంగా పాకిస్తాన్ ని కోరడం గమనార్హం. అనేక దశాబ్దాలుగా భారత్ తీవ్రవాదం బారినపడిందని మోదీతో సమావేశం తర్వాత ఆమె అంగీకరించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్