అమితాబ్ కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ షాక్.. ఆ ప్రకటనల నుంచి వెంటనే తప్పుకోవాలంటూ...

Published : Sep 24, 2021, 09:47 AM IST
అమితాబ్ కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ షాక్.. ఆ ప్రకటనల నుంచి వెంటనే తప్పుకోవాలంటూ...

సారాంశం

పొగాకు, పాన్ మసాలా  వ్యసనం  పౌరుల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందని  వైద్య పరిశోధనల్లో  తేలిందని,  అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే  ప్రకటనల ప్రచారం నుంచి  వైదొలగాలని కోరుతూ  నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ (National Anti-Tobacco Organisation) సంచలన లేఖ రాసింది.  అమితాబచ్చన్ పాన్ మసాలా(pan masala)ను ప్రచారం చేసే ప్రకటన ప్రచారం నుంచి వైదొలగాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ కోరింది. 

పొగాకు, పాన్ మసాలా  వ్యసనం  పౌరుల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందని  వైద్య పరిశోధనల్లో  తేలిందని,  అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే  ప్రకటనల ప్రచారం నుంచి  వైదొలగాలని కోరుతూ  నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు.

‘‘అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్. అతను వీలైనంత త్వరగా  పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి.  పొగాకు వ్యసనం నుంచి యువతదూరంగా ఉండడానికి ఈ చర్య సహాయపడుతుంది’’  అని శేఖర్ సల్కర్ కోరారు.  

19ఏళ్ల యువతి పై అత్యాచారం చేసి.. పదో అంతస్తు నుంచి కిందకు తోసేసి..

పాన్ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది.  తమలపాకులోని పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకాలుగా మారి నోటి క్యాన్సర్ కు దారితీస్తాయి అని తేలింది. ‘పాన్ మానవులకు క్యాన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్,  ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థలు నిర్ధారించాయి’ అని బచ్చన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Surya Tilak on Ram Lala in Ayodhya: అయోధ్యలో అద్భుతంబాలరాముని నుదుటిన సూర్య తిలకం | Asianet Telugu
శ్రీరామనవమి రోజు అయోధ్యలో వానరం ఏం చేసిందో చూడండి: Ayodhya Rama Navami | Asianet News Telugu