ఇండియాలో గత 24 గంటల్లో 30,948 కరోనా కేసులు:కరోనాతో 403 మంది మృతి

By narsimha lodeFirst Published Aug 22, 2021, 10:32 AM IST
Highlights


ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనాతో మరణించిన రోగుల సంఖ్య పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 30,948 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు 30,948కి చేరుకొన్నాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు కరోనా కేసుల్లో తగ్గుదల కన్పించింది. కానీ  కరోనాతో మరణించిన వారి సంఖ్య మాత్రం పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 403 మంది మరణించారు. 

నిన్న ఒక్కరోజే 15,85,681 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే  30,948 మందికి కరోనా సోకింది.కరోనాతో మరణించినవారి సంఖ్య 4,34,367కి చేరుకొంది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 38,487 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 3,16,36,469 మంది కరోనా నుండి  కోలుకొన్నారు. కరోనా రికవరీ రేటు 97.57 శాతంగా నమోదైందని ఐసీఎంఆర్ తెలిపింది.

వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 2.09 శాతంగా నమోదైంది. గత 58 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉందని ఐసీఎంఆర్ ప్రకటించింది. రోజువారీ కరోనా కేసుల పాజిటివిటీ రేటు 1.95 శాతంగా నమోదైంది. గత 27 రోజులుగా 3 శాతానికి కంటే తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398గా నమోదైంది. 

ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 52,23,612 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 58,14,89,377 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.
 

click me!