తాగుబోతు భర్తను ఇంటి నుంచి గెంటేసిన భార్య.. పగ బట్టి..!

Published : Aug 03, 2021, 10:11 AM ISTUpdated : Aug 03, 2021, 10:16 AM IST
తాగుబోతు భర్తను ఇంటి నుంచి గెంటేసిన భార్య.. పగ బట్టి..!

సారాంశం

తాను నిరాశ్రయుడు కావడానికి తన భార్య కారణం అని ప్రతీకారంతో.. శనివారం ఉదయం భార్య షబానాతో ఘర్షణ పడి హత్య చేశాడు. 

అతను పచ్చితాగుబోతు. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా... ఎప్పుడూ మందు తాగుతూనే ఉంటాడు. కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. దీంతో.. అలాంటి భర్తను భరించలేకపోయిన భార్య..  ఆ భర్తను ఇంట్లో నుంచి గెంటేసింది. తనను ఇంట్లో నుంచి గెంటేసిందనే కారణంతో.. భార్యపై పగ పెంచుకున్నాడు. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని మంగోల్‌పురిలోకి చెందిన సమీర్‌(45) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బులు కావాలని భార్య షబానాతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నెల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. అప్పటి నుంచి అతను వీధుల్లో నివసిస్తున్నాడు.

తాను నిరాశ్రయుడు కావడానికి తన భార్య కారణం అని ప్రతీకారంతో.. శనివారం ఉదయం భార్య షబానాతో ఘర్షణ పడి హత్య చేశాడు. అంతేకాకుండా భార్యను కత్తితో పొడిచి చంపి స్టేషన్‌లో లొంగిపోయాడు. అని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై నిందితుడుని మంగోల్‌పురి స్టేషన్‌ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇక అతని భార్య షబానా (40)ను స్థానికులు సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. కాగా, ఈ జంటకు 21, 17 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport