ఇండియాలో ఏడో రోజూ అదే జోరు: 24 గంటల్లో మూడున్నర లక్షలు దాటిన కేసులు

By narsimha lodeFirst Published Apr 28, 2021, 10:44 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో 3,60,960 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 1,79,97,267 కి కరోనా కేసులు చేరుకొన్నాయి.  కరోనాతో ఒక్క రోజు వ్యవధిలోనే  3,293 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య2,01,187కి చేరాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 3,60,960 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 1,79,97,267 కి కరోనా కేసులు చేరుకొన్నాయి.  కరోనాతో ఒక్క రోజు వ్యవధిలోనే  3,293 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య2,01,187కి చేరాయి.దేశంలో ఇంకా  29,78,709 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటికి 1,48,17,371 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత ఉందని కేంద్రానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మంగళవారంనాడు ఆయా రాష్ట్రాలకు కేంద్రం కోటి వ్యాక్సిన్ డోసులను విడుదల చేసింది. 

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో  ఎక్కువ మంది రోగులు ఆక్సిజన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు  ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్ సరిపోను అందడం లేదు. అయితే  ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. పలు పరిశ్రమల్లో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇతర దేశాల నుండి  ఆక్సిజన్ ను కూడ కేంద్రం దిగుమతి చేసుకొంటుంది. ఆయా రాష్ట్రాలకు సమీపంలోని పరిశ్రమల నుండి ఆక్సిజన్ ను  కేంద్రం సరఫరా చేస్తోంది.  మరోవైపు రైల్వే శాఖ కూడ వ్యాగన్ల ద్వారా  ఆక్సిజన్ ను  సరఫరా చేస్తోంది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!