విషాదం : కాబోయే వరుడ్ని కాటికి పంపిన కరోనా.. ఆస్పత్రిలో బెడ్డు దొరకక మృతి !

Published : Apr 28, 2021, 10:38 AM IST
విషాదం : కాబోయే వరుడ్ని కాటికి పంపిన కరోనా.. ఆస్పత్రిలో బెడ్డు దొరకక మృతి !

సారాంశం

కరోనా విలయతాండవం చేస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టే కాటికి పంపేస్తుంది. తాజాగా కర్ణాటక లో ఘోరవిషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు కరోనా కాటుతో చితిమీదికి ఎక్కాల్సి వచ్చింది.

కర్ణాటకలోని తుమకూరులో కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతున్న యువకుడికి కరోనా సోకింది. దీంతో అతను చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. సదరు యువకుడు మొబైల్‌షాపులో పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హాలుకట్టి గొల్లరహట్టి.

తెలంగాణలో కరోనాది అదే జోరు: ఒక్క రోజులో 8,061 కేసులు, 56 మంది మృతి...

ఇతనికి ఇటీవలే పెళ్లి నిశ్చయమయ్యింది. మూడు రోజుల కిందట అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్ అని తేలింది.  వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లగ అక్కడ బెడ్లు ఖాళీ లేవన్నారు. 

తిపటూరుకు వెళ్లగా  అక్కడ కూడా చేర్చుకోలేదు. ఈ క్రమంలో హాసన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేందుకు తీసుకువెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. తుమకూరులోనే వైద్యం చేసి ఉంటే బతికేవాడు, పెళ్లికొడుకు కావాల్సినవాడు శ్మశానానికి వెళ్లావా నాన్నా అంటూ తల్లిదండ్రులు భోరున విలపించారు. వారు రోదిస్తున్న తీరు అందరిచేత కంటతడి పెట్టించింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం