
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 8,061 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,19,966కి చేరుకొన్నాయి.ఒక్క రోజులో కరోనాతో 56మంది చనిపోయారు.
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 72,133కి చేరుకొన్నాయి. కరోనాతో మరణాల రేటు 0.51శాతానికి చేరుకొన్నాయి.ఇంకా రాష్ట్రంలో 5241 మంది పరీక్షలు రావాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో 125, కొత్తగూడెంలో 088,జీహెచ్ఎంసీలో068,జగిత్యాలలో 252, జనగామలో 088,భూపాలపల్లిలో068, గద్వాలలో082,,కామారెడ్డిలో 202, కరీంనగర్ లో 275,ఖమ్మంలో 277, ఆసిఫాబాద్ 079, మహబూబ్‌నగర్ లో 328,మంచిర్యాలలో 171, మెదక్ లో 127,మల్కాజిగిరిలో 673,ములుగులో 047, నాగర్‌కర్నూల్ లో 188, నల్గొండలో311 లో కేసులు నమోదయ్యాయి.
నారాయణపేటలో 040,నిర్మల్ లో 109,నిజామాబాద్ లో 291,పెద్దపల్లిలో 145,సిరిసిల్లలో142, సంగారెడ్డిలో 373, సిద్దిపేటలో 253, సూర్యాపేటలో 185, వికారాబాద్ లో 276, వనపర్తిలో 146,వరంగల్ రూరల్ లో 191,వరంగల్ అర్బన్ 203, భువనగిరిలో 213 కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో 61.5 శాతం మందికి కరోనా సోకింది. మహిళల్లో 38.5 శాతంగా కేసులు రికార్డయ్యాయి.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona